calender_icon.png 16 May, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింధూ జలాలు వదలం

16-05-2025 01:41:23 AM

  1. పాక్ అభ్యర్థన తర్వాత తొలిసారి స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

తీవ్రవాద అంతంపైనే చర్చలుంటాయి

న్యూఢిల్లీ, మే 15: పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి పుల్‌స్టాప్ పెట్టేంత వరకూ సింధూ నదీ జలాల ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని బుధ వారం పాకిస్థాన్ భారత్‌ను అభ్యర్థిస్తూ లేఖ రాసింది.

పాక్ లేఖపై స్పందించిన మంత్రి పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. ఇక భారత్ మధ్య భవిష్య త్‌లో చర్చలు జరిగితే ఉగ్రవాదం గురించే అని పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ అంగీకరించదన్నారు.

అప్పుడే సింధూ జలాలు వెళ్తాయి

‘పాక్ సీమాంతర ఉగ్రవాదం వదిలిపెట్టేంత వరకూ సింధూ నదీ జలాల ఒప్పం దాన్ని పునరుద్ధరించం. ఆపరేషన్ సిందూ ర్ ద్వారా మేము అనుకున్న లక్ష్యాలను సా ధించాం. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాద మౌలి క సదుపాయాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని, సైనికుల మీద ఎటువంటి దాడులు చేయడం లేదని ఆపరేషన్‌కు ముందే పాక్‌కు సందేశం ఇచ్చాం.

కానీ వారు పట్టించుకోలేదు. నష్టం విషయం లో పాక్ అబద్దాలు చెప్పినా కానీ వారికి ఎంత మేర నష్టం జరిగిందనేది ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌కు స్వల్పంగానే నష్టం జరిగింది. కాల్పుల విరమణ కోసం పాకిస్థానే అభ్యర్థించింది.’ అని పేర్కొన్నారు.