calender_icon.png 16 May, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో చార్జీల మోత

16-05-2025 01:08:30 AM

  1. టికెట్ ధర కనిష్ఠంగా రూ.12, గరిష్ఠంగా రూ.75
  2. రేపటి నుంచి అమలులోకి..

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మెట్రో రైలులో చార్జీ లను ఎల్ అండ్ టీ సంస్థ పెంచింది. మెట్రో రైలు టికెట్ ధర కనిష్ఠంగా రూ.12 కాగా, గరి ష్ఠంగా రూ.75గా ఉండనుంది. ప్రస్తుతం మెట్రో రైలులో టికెట్ కనిష్ఠ ధర రూ.10, గరి ష్ఠంగా రూ.60గా ఉంది. పెంచిన ధరలు శని వారం నుంచి అమల్లోకి వస్తాయని హైద రాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. మెట్రో నష్టాల్లో ఉన్నదని, నష్టాల నుంచి గట్టెక్కేందుకు చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఎల్ అం డ్ టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో మే 10వ తేదీ తర్వాత చార్జీలు పెంచుతామని ఎల్‌అండ్‌టీ సంస్థ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా శనివారం నుంచి చార్జీల పెంపు వర్తి స్తుందని ఆ సంస్థ వెల్లడించింది. చా ర్జీల పెంపుతో ప్రయాణికులపై మ రింత భారం పడనుంది.

పెరిగిన చార్జీలు ఇలా..

మొదటి 2 స్టాప్‌లకు       :      రూ.12

2 నుంచి 4 స్టాప్‌లకు : రూ.18 

4 నుంచి 6 స్టాప్‌లకు : రూ.30

6 నుంచి 9 స్టాప్‌లకు : రూ.40 

9 నుంచి 12 స్టాప్‌లకు : రూ.50 

12 నుంచి 15 స్టాప్‌లకు : రూ.55 

15 నుంచి 18 స్టాప్‌లకు : రూ.60 

18 నుంచి 21 స్టాప్‌లకు : రూ.66 

21 నుంచి 24 స్టాప్‌లకు : రూ.70 

24 స్టాప్‌లు, ఆపైన         : రూ.75