16-05-2025 12:56:33 AM
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను 2025 సంవత్సరంలో భర్తీ చేసేందుకు యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌ను గురువారం విడుదల చేసింది. నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ, పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీల వివరాలను పొందుపరిచింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్‌ను 2026, జనవరి 14న విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించి, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది మే 24న, మెయిన్స్ పరీక్ష అదే ఏడాది ఆగస్టు 21 నుంచి నిర్వహిం చనున్నారు. ఇక యూపీఎస్సీ ఎన్‌డీఏ-1, సీడీఎస్-1 నియామక నోటిఫికేషన్-2026ను ఈ ఏడాది డిసెంబర్ 10న విడుదల చేస్తారు.
డిసెంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించి, 2026, ఏప్రిల్ 12న రాతపరీక్ష నిర్వహిస్తారు. ఎన్‌డీఏ సీడీఎస్-2 కు సంబంధించి వచ్చే ఏడాది మే 20న నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. జూన్ 9 వరకు దరఖాస్తులు స్వీకరించి, 2026, సెప్టెంబర్ 13న పరీక్షలు నిర్వహిస్తారు.
మరికొన్ని నియామక పరీక్షల వివరాలు..
* కంబైన్డ్ జియో సైంటిస్ట్ 2026: ఈఏడాది సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 వరకు దరఖా స్తులు, 2026, ఫిబ్రవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష. 2026, జూన్ 20 నుంచి మెయిన్స్.
* ఇంజినీరింగ్ సర్వీసెస్ - 2026: నోటిఫికేషన్ ఈ ఏడాది సెప్టెంబర్ 17న విడుదల, అక్టోబర్ 7 వరకు దరఖాస్తులు. 2026, ఫిబ్రవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ. మెయిన్స్ జూన్ 21న.
* సీబీఐ (డీఎస్పీ) ఎల్‌డీసీఈ: నోటిఫికేషన్‌ను ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల చేసి, 2026 జనవరి 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు.