11-02-2025 12:00:00 AM
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి10: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ రంగరాజన్ పై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ర్ట కార్యదర్శి బుగ్గ కృష్ణమూర్తి శర్మ తీవ్రంగా ఖండిం చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రాహ్మణుల పై దాడులకు ప్రభుత్వం దే బాధ్యత అని,రంగరాజన్ పై దాడికి తెగబడ్డ వారిని అరెస్టు లతో సరిపెట్ట కుండా వారికి శిక్షలు పడేలా చర్యలు చేపట్టా లని కోరారు.
రాష్ర్టంలో ఉద్యోగులు, వైద్యు లపై దాడులు జరిగితే ఎలా చట్టం తెచ్చారో బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులపై చ ట్టం తీసుకురావాలని కృష్ణమూర్తి శర్మ ప్ర భుత్వాన్ని కోరారు. అలాగే రాష్ర్టంలోని ప్ర ముఖ దేవాలయాల్లో సెక్యూరిటీ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. దాడులకు తెగ బడే వారికి దమ్ము ధైర్యం వుంటే ముందుగా అన్యాక్రాంతం అయిన ఆలయ భూములను తిరిగి ఆలయాలకు చెందేలా చూడాలన్నారు.
సున్నిత మనస్కులు అయి నిత్యం భగవన్నా మ స్మరణతో వుండే బ్రాహ్మణులపై దాడు లు చేసేవారు ధర్మనుగ్రహానికి లోను కావ ద్దని హితవు చెప్పారు. బ్రాహ్మణులకు ఆగ్ర హం కలిగి అన్ని పూజా కైం కర్యాలను, ఇళ్ళల్లో శుభ కార్యకార్యక్రమాలను చేయకుం డా, ఎక్కడికి వెల్లి పూజలు నిర్వహించనీ పరి స్థితి ఏర్పడితే ఎలా వుంటుంది అన్నది ఊ హించాలని ఆన్నారు.మేదావులు, ప్రభుత్వ పెద్దలు బ్రాహ్మణుల రక్షణకు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణమూర్తి శర్మ డిమాం డ్ చేశారు.