calender_icon.png 28 November, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ సవరణతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాకారం

28-11-2025 12:00:00 AM

ప్రజా ఐక్య కూటమి ఛైర్మన్ దాసు సురేశ్ 

ఖైరతాబాద్; నవంబర్ 27 (విజయ క్రాంతి) : రాజ్యాంగ సవరణతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సహకారం అవుతుందని  ప్రజా ఐక్య కూటమి ఛైర్మన్ దాసు సురేశ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఎదురవుతున్న సవాళ్లు-పరిష్కారాలు, తదుపరి కార్యాచరణ అనే అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ప్రజా ఐక్య కూటమి జెండా, ఎజెం డాను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.

ఈ సందర్భం గా ప్రజా ఐక్య కూటమి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఛైర్మన్ గా దాసు సురేశ్, కోర్ లీడర్ షిప్ కమిటీ సభ్యులుగా తులసి శ్రీమా న్, మారేపల్లి లక్ష్మణ్, పోశాల సరస్వతి, ఊరుమల్ల విశ్వం ,అయిల ప్రసన్న, శుక్రుద్దీన్, నూనె రమేశ్ ముదిరాజ్, గంటా సత్య నారాయణలను నియమితులయ్యారు. ఈ సందర్భంగా హర్యానా  మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ...1931 తరువాత స్వతంత్ర భారతంలో కులగరణ చేస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు.

బీసీల 42శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణకు కూడా ప్రధాని సహకరించాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రయత్నం వల్లనే తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధ్యమైందన్నారు. అందరినీ కలుపుకుని గ్రామస్థాయి నుండి బలమైన ఉద్యమాలు నిర్మిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం  నూతన చైర్మన్ దాసు సురేష్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధన కోసం ద్విముఖ వ్యూ హంతో ఇటు క్షేత్ర స్థాయిలో అటు దిల్లీ కేంద్రంగా బీసీ సమాజం ఉద్యమించాలని అన్నారు.

ఇందుకోసం పరస్పర ఆరోపణలు మాని ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రజా ఐక్య కూటమి ద్విముఖ వ్యూహంతోనే ముందుకు సాగుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసుకుని ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలను బలోపేతం చేస్తామని చెప్పా రు. స్పష్టమైన ఆలోచన, సరైన విధానం, చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా ఐక్య కూటమి... బీసీ రిజర్వేషన్ల పెంపును సాధిస్తుందని తెలిపారు.

ప్రజా ఉద్యమాలతోనే నేడు దేశవ్యా ప్త కులగణన సాధ్యమైందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్, ఫార్మర్స్ రైట్స్ సంస్థ అధ్యక్షులు వడ్డేపల్లి రామకృష్ణ, న్యాయ నిపుణులు ఎస్ మంజుల , మాజీ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ దొంత ఆనందం, బహుజన సేన అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్, ఉద్యమకారుల జేఏసీ నాయకులు కొనతం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.