10-07-2025 12:21:09 AM
ఘట్ కేసర్, జూలై 9 : లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్ కేసర్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. అధ్యక్షులుగా లయన్ సారా శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రెటరీగా బచ్చు ప్రమోద్ గుప్తా, ట్రెజరర్ గా సన్నిధి కృష్ణ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లుగా రేసు లక్ష్మారెడ్డి, ఉడుత హిమబిందు, క్ల బ్బు నంబర్ షిప్ చైర్ పర్సన్ గా బచ్చు నాగేష్ గుప్త లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈకార్యక్రమంకు మేడిపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేముల కేశవ నాథంగౌడ్ అధ్యక్షత వహించగా ఎలక్షన్ ఆఫీసర్ గా సీనియర్ లయన్స్ లయన్ ప్రసాద్, లయన్ మరియాల అశోక్, విధులు నిర్వహించారు.
ఈనూతన క్లబ్ లో సభ్యత్వం తీసుకున్న చందుపట్ల మహేందర్ రెడ్డి, శ్రీలక్ష్మి, కె. మాధవి, జగదీష్ , భోగ హరినాథ్, సార రాజు, కిరణ్, నర్సింగ్ రావు, చిక్కల రవిశంకర్, హాజరై ఈకార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూతనంగా ఎన్నికైన లయన్ సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకొని నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టిన మీనమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలోనే మన క్లబ్బును ప్రథమ స్థానంలో తీసుకపోవడానికి కృషి చేస్తానని నాకు సహకరించిన మిత్రులకు, నాటీం మిత్రులకు నాతో ఎలెక్టివ్ కాబడిన టువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడి విచ్చేసిన సీనియర్ లయన్స్ కు ముఖ్యంగా ఈక్లబ్బును ఇంట్రడ్యూస్ చేస్తున్న వేముల కేశవనాదంగౌడ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.