12-07-2025 07:04:54 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కిమ్స్ లా కళాశాల(Kims College Of Law)లో ఎక్స్ ట్రా గవాంజా పేరుతో శనివారం నిర్వహించిన కార్యక్రమం అలరించింది. ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేర్యాల రవీందర్ రావు(Chairman Dr. Periyala Ravinder Rao) మాట్లాడుతూ.. సామర్థ్యం అనేది క్రమపద్ధతిలో లభించే శిక్షణతో కలిసి ప్రావీణ్యంగా మారుతుందన్నారు. అత్యుత్తమంగా తయారవ్వాలంటే ఇంకోమార్గం లేదని, సరైన శిక్షణ పొందుతూ ఎదగటాన్ని మించినది జీవితంలో ఏది లేదన్నారు. వైస్ ఛైర్మెన్ సాకేత్ రామారావు మాట్లాడుతూ.. సాధ్యం కాదన్న భావనను మనసులో నుండి తొలగించడమే విజయపధంలో వేసే తొలి అడుగు అన్నారు. ఏదైనా గొప్పగా సాధించాలని మొండిగా నిలబడిన వారి ముందు ఏ కష్టమైనా తలవంచుతుందని తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కృష్ణారెడ్డి, సిబ్బంది వెంకటస్వామి, కొమురయ్య, కిషన్, వంశీ, కీర్తి, చారి, రమ్య, తదితరులు పాల్గొన్నారు.