12-07-2025 07:23:35 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. మహబూబాబాద్ మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు లయన్ పమ్మి సనాతన చారి హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరాన్ని మహబూబాబాద్ జిల్లా ఐఆర్సిఎస్ చైర్మన్ పివి ప్రసాద్ ప్రారంభించారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని తిరిగి 15 రోజులలో రక్తం పునరుత్పత్తి అవుతుందన్నారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వీరన్న మాట్లాడుతూ రక్తదానం చాలా మంచిదని, అందుకు యువత అందరినీ ప్రోత్సహించాలని, ఇది వారి చేతుల్లోనే ఉందని, భవిష్యత్తు కాలంలో యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల పూర్ణాచారి, కోశాధికారి పెందోట హరి, లయన్స్ క్లబ్ కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, న్యాయవాది కొండపల్లి కేశవరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సమావేశంలో లయన్ డాక్టర్ జగన్మోహన్రావు, లయన్ అనుమాండ్ల వెంకటేశ్వర్లు, లయన్ అనుమాండ్ల సిద్ధార్థ్ , సాదుల సురేష్ ,లయన్ డాక్టర్ రాజ్ కుమార్, లయన్ మాలే కాళీనాథ్, డాక్టర్ అర్జున్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ రాథోడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మోత్కూరి శంకర్ స్వర్ణకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ హితేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది 45 మంది దాతల నుంచి రక్త సేకరణ చేశారు.