calender_icon.png 13 July, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధార్థలో ప్రమాణ స్వీకార మహోత్సవం

12-07-2025 07:07:34 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని సిద్ధార్థ విద్యాసంస్థల స్కూల్(Siddhartha Educational Institutions School) లీడర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు భగత్నగర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఎన్నికైన కెప్టెన్లు, వైస్ కెప్టెన్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సిద్ధార్థ పాఠశాల ఫౌండర్ దాసరి నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం డి.ఎన్.ఆర్. స్కాలర్షిప్ పేరుతో గత అకాడమిక్ లో అత్యున్నత ప్రతిభకనబరిచిన విద్యార్థులందరికీ 10,000 చొప్పున నగదు పారితోషికం, అకాడమిక్ ఎక్సలెన్స్ బ్యాడ్జ్ లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.