calender_icon.png 13 July, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42% రిజర్వేషన్ పై హర్షం..

12-07-2025 07:16:19 PM

కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..

బోథ్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మండలి బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్స్ తీసుకువస్తామని తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం బోథ్ నియోజకవర్గ కేంద్రంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల హామీ ప్రకారం దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు జనాభా దామాషా ప్రకారం ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశాన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి, బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి తదితరులు పాల్గొన్నారు.