calender_icon.png 13 July, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్స్ కౌన్సిలింగ్

12-07-2025 06:52:11 PM

మణుగూరు (విజయక్రాంతి): ఏరియా జీఎం ఆదేశాల మేరకు ఉద్యోగులకు పివి కాలనీలోని ఎంసి, T-2 టైప్ క్వార్టర్స్ ను మెడికల్ గ్రౌండ్స్, చేంజ్ ఆఫ్ క్వార్టర్స్ కౌన్సిలింగ్ ను క్వార్టర్ ఎలట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఓ టు జిఎం కార్యాలయంలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఖాళీ, సీనియారిటీ ప్రకారం క్రింది క్వార్టర్ కేటాయించడం జరుగుతాయని అధికార ప్రతినిధి, డిజిఎం (పర్సనల్) రమేశ్ తెలిపారు. అర్హత కలిగిన వారికి క్వార్టర్ అలాట్మెంట్ ఉత్తర్వులు జారి చేయనున్నట్లు, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా నిబంధనలకు అనుగుణంగా క్వార్టర్లు కేటాయించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్ఈ(సివిల్) బి.వి.వి. ఎన్ పాత్రుడు, డా. రమణయ్య, ఏఐటియూసి బ్రాంచ్ సెక్రటరీ రాంగోపాల్, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ కృష్ణం రాజు, సింగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.