calender_icon.png 5 September, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహితీ మూర్తుల సాహిత్య సమాలోచన

04-09-2025 12:23:56 AM

ఐఐఎంసీ కాలేజీలో 10న జాతీయ సదస్సు

ఖైరతాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో ఐఐఎంసీ తెలుగు శాఖ, తెలుగు భాషా చైత న్య సమితి సంస్థ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య, కాళోజి నారాయణరావు, సి నారాయణరెడ్డి, దాశరథి రంగాచార్య జ యంతులను పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా  ఐఐఎంసీ కళాశాలలో ఈ నెల 10వ తేదీన ’సాహితీ మూర్తుల సాహిత్య సమాలోచన’ ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు.

ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రికను, గోడపత్రికలను కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘు వీర్ ఆవిష్కరణ చేసి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలోని దాదాపు 150  జూనియర్, డిగ్రీ, పీజీ  కళాశాలల ప్రధాన ఆచార్యులకు, 120 మంది తెలుగు అధ్యాపకులకు  అందజేశారు. ఈ సదస్సులో పై నలుగురు సాహి తీవేత్తలపై పత్ర సమర్పణ చేయాలనుకున్న వారు ఈ నెల 6వ తేదీ లోపు పరిశోధనా పద్ధతులను ఉపయోగించి రాసిన పూర్తి పత్ర సమర్పణ అంశాన్ని  యూనికోడ్ వర్డ్‌ఫైల్ లేదా అను 7లో టైప్ చేసి, రిజిస్ట్రేషన్ రుసు ము రూ.500 చెల్లించి, eluguseminar @iimchyd.ac.inకు పంపించాలని,

పూర్తి వివరాల కోసం ఐఐఎంసి కళాశాల వ్బుసైట్‌ను సందర్శించాలని చెప్పారు. ఇప్పటివర కు  ఈ సదస్సుకు 5 రాష్ట్రాల నుంచి  అధ్యాపకులు, సాహిత్య అభిమానుల  90 వ్యాస సంగ్రహాలు, 45 పూర్తి వ్యాసాలు రాసి పం పించారు. ఉత్తమ పత్ర సమర్పకులకు నగ దు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. సదస్సులో పాల్గొనే వారు రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. వారికి సదస్సుకు సం బంధించిన కిట్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును. వివరాలకు 9885521904, 7382183258, 9493976082, 9492863583 నంబర్లలో సంప్రదించగలరు.