calender_icon.png 22 November, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

22-11-2025 10:07:04 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసు స్టేషన్ ఆవరణ పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేస్తూ... అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయ్యాలని, ప్రతి గ్రామాన్ని సందర్శించి, చుట్టూ జరుగుతున్న వివిధ రకాల నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలల్లో అవగాహన కల్పించాలని ఎస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు.

సరిహద్దు ప్రాంతాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, అక్రమ మద్యం అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులను నిర్వహిస్తూ నిఘా కట్టు దిట్టం చెయ్యాలన్నారు. సరిహద్దు ప్రాంతాలల్లో, ప్రధాన కూడలిలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయ్యాలన్నారు. ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రజలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఒ కు సూచనలు చేశారు. ఈ తనిఖీలో జిల్లా ఎస్పీతో పాటు ఖేడ్ డిఎస్పి  వెంకట్ రెడ్డి, కంగ్టీ సిఐ వెంకట్ రెడ్డి ఉన్నారు.