calender_icon.png 13 May, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

13-05-2025 04:52:12 PM

సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ..

పెన్ పహాడ్: ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు(CITU) జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో హమాలి కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులు కొమ్ముకాస్తూ ప్రభుత్వ సంస్థలన్నీటిని కార్పొరేషన్ పెట్టి దేశాన్ని దివాలా తీపిస్తున్నారని అన్నారు. ఎంతో కాలంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాల రాస్తున్నారని ఆయన దుయ్యాపట్టారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాల విధానాలపై ఈనెల 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను కర్షకులు కార్మిక లోకం పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హామాలి సంఘం ముఠామేస్త్రి భూక్య జగపతి, కార్మికులు నునావత్ పాండు, ధారావత్ మంగ్య, కిషన్, కీమా, రమేష్, నాగు తదితరులు పాల్గొన్నారు.