27-09-2025 01:45:26 AM
పటాన్ చెరు, సెప్టెంబర్ 26 :నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో సీఎం సహాయనిధి వరప్రదాయనిగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బిహెచ్‌ఇఎల్ టౌన్షిప్ లో నివసిస్తున్నషేక్ ఇబ్రహీం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్‌ఓసిని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో షేక్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, శ్రీధర్ చారి, చంద్రశేఖర్, రామిశెట్టి పాల్గొన్నారు.