calender_icon.png 27 September, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘ అభివృద్ధికి రైతులు సహకరించాలి

27-09-2025 02:38:31 PM

విండో చైర్మన్ కయ్యం నరసింహ రెడ్డి..

నిజాంసాగర్ (విజయక్రాంతి): సహకార సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అచ్చంపేట సహకార సంఘ అధ్యక్షులు నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం అచ్చంపేట సహకార సంఘంలో నిర్వహించిన మహాజన సభలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఎరువుల విక్రయాలు, కల్యాణ మండప అద్దె ద్వారా వచ్చిన ఆదాయంతో సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. అందరి సహకారంతో సహకార సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ఎల్లవేళల కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విండో కార్యదర్శి సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.