calender_icon.png 27 September, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపార రంగంలో పాపన్నపేట ముందుండాలి

27-09-2025 01:44:07 AM

పెట్రోల్ బంకు ప్రారంభోత్సవంలో ఎంపీ సురేష్ షేట్కర్ 

పాపన్నపేట, సెప్టెంబర్ 26 :పాపన్నపేట మండలం వ్యాపార రంగంలో ముందుండాలని, వ్యాపారంలో పోటీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో గణేష్ హెచ్ పి పెట్రోల్ బంక్ ను వారి చేతుల మీదుగా ప్రా రంభించారు. కార్యాలయం ప్రారంభించిన అనంతరం వాహనాలలో డీజిల్ వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. పాపన్నపేట ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలో ముందుకు వెళుతుందన్నారు. ప్రతి ఒ క్కరు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా పాపన్నపేటను వ్యాపార రంగంలో అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యజమాన్యం రాజశే ఖర్, మహేందర్, నాయకులు ప్రశాంత్ రెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీకాంత్, గోవింద్ నాయక్, నిట్టలాక్షప్ప, ఆకుల శ్రీనివాస్, వివిధ గ్రామా ల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.