calender_icon.png 27 September, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన కాంగ్రెస్ పార్టీ ఆదివాసి శిక్షణ శిబిరాలు

27-09-2025 02:38:31 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ఈనెల 25న కరీంనగర్ డిసిసి కార్యాలయం ఇందిరా గార్డెన్స్ లో ప్రారంభమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా(Karimnagar District) స్థాయి కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆదివాసి మూడు రోజుల శిక్షణ శిబిరాలు శనివారంతో ముగిసినాయి. ఈనెల 25న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శిక్షణ శిబిరాలను ప్రారంభించగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్టి సెల్ సమన్వయకర్త కోట్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ ఆదివాసి సెల్ చైర్మన్ బానోతు శ్రవణ్ నాయక్,  జిల్లా ఆర్టిఏ  మెంబర్ పడాల రాహుల్, మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు  ప్రారంభం కార్యక్రమానికి హాజరైనారు.

మూడు రోజులపాటు జరిగిన శిక్షణ శిబిరాలలో రాష్ట్ర ఆదివాసి సెల్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బేల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన శిక్షణ శిబిరాల ద్వారా 1200 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని త్వరలోనే వీరందరితో మీనాక్షి నటరాజన్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఒకరోజు శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేతల సమక్షంలో నిర్వహించే కార్యక్రమానికి శిక్షణ పొందిన వారిని ఆహ్వానించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గస్థాయిలో 100మందితో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తాము. ఈ జిల్లా నుండి 500 మంది నాయకులను సమర్థవంతులుగా తయారు చేస్తామని బెల్లయ్య నాయక్ అన్నారు.