calender_icon.png 27 September, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనదుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్, మాజీ ఎమ్మెల్యే

27-09-2025 01:46:47 AM

పాపన్నపేట, విజయక్రాంతి : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం వేరువేరు సమయాల్లో ఏడుపాయలకు విచ్చేసి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న గోకుల్ షెడ్ లోని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

నంతరం రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బంది వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.