27-09-2025 02:36:01 PM
పరిశీలించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కొండాపూర్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో భారీ వరద ఉద్రిక్తతకు రహదారి కొట్టుకుపోయింది. సదాశివపేట, టేకులపల్లి, అనంతసాగర్ మోమిన్ పేట్ వైపు రాకపోకలు నిలిచాయి. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సైదాపూర్ శివారులోని రహదారి స్థానిక నాయకులతో కలిసి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన కొట్టుకుపోయిన రోడ్డు మరమ్మతులు చెయ్యాలని కొండాపూర్ ఎమ్మార్వో అశోక్ కు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశించారు. సైదాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్లక్ష్యం చేయకుండా, సైదాపూర్ గ్రామ శివారులో కొట్టుకుపోయిన రోడ్డును ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.
40 ఎకరాల్లో పంట నష్టం.
సైదాపూర్ గ్రామ శివారులోని రోడ్డు కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల ఉన్న 40 ఎకరాల వరి, పత్తి పంటలు నష్టపోయాయని ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకొచ్చారు. భారీ వర్షాలతో 40 ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.