calender_icon.png 9 October, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు

09-10-2025 01:11:55 AM

బస్ భవన్‌పై రాజకీయం చేయవద్దని బీఆర్‌ఎస్‌కు మంత్రి పొన్నం హితవు 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం తరఫున తమ వాదనలు బలంగా వినిపించామని, దేశంలో తొలి రాష్ర్టంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కన పెట్టి అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఇంప్లీడ్ కావాలని కోరారు.

ఆర్టీసీ నష్టాల నుంచి లాభా ల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు నడపాలంటే డిపోలో స్టేషన్‌కు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 2019లో ఆర్టీసీ కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేస్తే  ఉక్కుపాదం మోపారని, ఇప్పు డు చలో బస్ భవన్ అనడం హాస్యాస్పదం గా ఉందన్నారు. బస్ భవన్‌పై రాజకీ యం చేయవద్దని బీఆర్‌ఎస్‌కు హితవుపలికారు.