28న లోక్ అదాలత్: ఎస్పీ జానకి
నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. కక్షిదారులు సద్వినియోగ పరచుకోవాలని పిలుపునిచ్చారు కక్షిదారులు కోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు .చాలా మంది ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన , తక్కువ ఖర్చుతో పరిష్కరించడానికి ప్రభుత్వం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 28న జరిగే.. జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియ జేశారు.ఇందులో చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు , సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,న్యాయ స్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చన్నారు. ఇది ఒక శాంతియుత పరిష్కార విధానమని, ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.




