calender_icon.png 22 December, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్‌కు విశేష స్పందన

22-12-2025 12:00:00 AM

1677 క్రిమినల్, 18 సివిల్ కేసుల పరిష్కారం

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 21 : జాతీయ లోక్ అదాలత్ లో 1677 క్రిమినల్, 18 సివిల్ కేసులు పరిష్కరించినట్టు న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవి తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన లోక్ అదాలత్ ను సాయిరమాదేవితోపాటు న్యాయమూర్తి ఎన్.సంతోష్ కుమార్ ప్రారంభించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరు వర్గాల మధ్య సామరస్యపూర్వకంగా పరిష్కరించారు.

1677 క్రిమినల్, 18 సివిల్, 16 మోటారు ప్రమాద కేసుల్లో రూ.1,34,75,000 పరిహారం ప్రకటించారు. 67 బ్యాంకు కేసులను పరిష్కరించి రూ.26,97,267 పరిహారం అందజేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తరణి, ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్ కాంతారావు, బార్ అసోసియేషన్ సెక్రటరీ రమేష్, న్యాయవాదులు, న్యాయసేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.