22-12-2025 12:00:00 AM
ధర్మపురి, డిసెంబర్ 21(విజయక్రాంతి): ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనీ, జీవితం మీద విరక్తితో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మపురి ఎస్త్స్ర మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్త్స్ర తెలిపిన వివరాల ప్రకారం ధర్మపురి మండలం రామయ్య పల్లి గ్రామానికి చెందిన కల్ల నవీన్ (24)అనే యువకుడు రెండు సంవత్సరాలు ఉద్యోగ నిమిత్తం దుబాయ్ వెళ్ళినాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి హైదరాబాదులో పని చేసుకుంటున్నాడు.
పది రోజుల క్రితం ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు.అతడు అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుందని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఈ నెల 20వ తేదీ శనివారం రోజున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంటి దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కరుణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర మహేష్ తెలిపారు.