13 April, 2026 | 4:20 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

చూడు చూడు..

24-11-2025 01:09 AM

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ బ్రీజ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ - చూడు చూడు (సైడ్ ఎ) లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాగవంశీకృష్ణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ నదీ తీరాల సువాసనను తీసుకుని వచ్చే ఈదురుగాలిలా అనిపిస్తుంది. ప్రేమను రంగుల్తో నింపే ఈ ట్యూన్ హృదయాన్ని నాట్యం చేయిస్తుంది. ఫ్లూట్, వైలిన్, నాదస్వరంలాంటి వాద్యాలతో సంగీతానికి  సున్నితమైన క్లాసిక్ టచ్ ని అందించారు.

హరి చరణ్ వోకల్స్ ఆ పాటకి మరింత మాధుర్యాన్ని జోడిస్తే, లిరిసిస్ట్ దినేష్ కాకర్ల హీరో ప్రేమలో ఉన్న అందమైన, చురుకైన అమ్మాయిని కవితాత్మకంగా సరదాగా వర్ణించారు. సుమంత్ ప్రభాస్ తన స్మూత్ డాన్స్ మూమెంట్స్తో ఉత్సాహం, ఉల్లాసాన్ని తీసుకువచ్చారు.

హీరోయిన్ నిధి ప్రదీప్ యాటిట్యూడ్తో పాటు మృదుత్వాన్ని కలగలిపి మెరిసిపోయింది.  కొరియోగ్రఫీ బ్యూటీఫుల్ గా వుంది. ‘చూడు చూడు’తో ఈ సినిమా మ్యూజిక్ జర్నీ బ్లాక్ బస్టర్ నోట్ లో మొదలైయింది.  ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ప్రవల్య ప్రొడక్షన్ డిజైనర్, అనిల్ కుమార్ పి ఎడిటర్,  నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైనర్.