16 June, 2026 | 2:45 AM

ఆకట్టుకున్న ఆరు గ్యారంటీల కేక్

16-06-2026 01:58 AM

కేక్ కట్ చేసిన డిప్యూటీ సీఎం 

బోనకల్, ఖమ్మం, జూన్ 15 (విజయక్రాంతి): ఉప ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని మధిర నియోజకవర్గం బోనకల్ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు కొమ్మినేని రమేష్ బాబు ప్రత్యేకంగా 120 కేజీల భారీ కేకును తయారు చేయించారు.

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ’ఆరు గ్యారంటీలు’, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భట్టి విక్రమార్క చేపట్టిన చారిత్రాత్మక ’పీపుల్స్ మార్చ్ పాదయాత్ర’ చిత్రాలతో ఈ కేకును అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం అందరినీ ఆకట్టుకుంది.  ప్రజాభవన్లో భట్టి ఈ కేక్ను కట్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఓయూ జేఏసీ నేత లోకేష్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా చేయించిన 70 కేజీల కేకును కూడా డిప్యూటీ సీఎం కట్ చేసి అక్కడి ప్రజాప్రతినిధులు, అభిమానులకు తినిపించారు.