16 June, 2026 | 2:43 AM

ఎల్‌ఓసీ చెక్కుల అందజేత

16-06-2026 01:57 AM

సత్తుపల్లి, జూన్ 15 (విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్ ) ద్వారా మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ( ఎల్ ఓ సి.) చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని, ప్రజల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  పేర్కొన్నారు.