మొదటి రోజు విద్యార్థులు అంతంత మాత్రమే
16-06-2026 02:03 AM
తుంగతుర్తి, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో జూన్ 15 పాఠశాలలు గురుకులాలు పున ప్రారంభం కావడంతో సోమవారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో, గురుకులాల్లో విద్యార్థులు ఒకటి సంఖ్యలకే పరిమితం కాగా, ప్రాథమిక పాఠశాలలో మాత్రం విద్యార్థులు ఉత్సాహంతో కనిపించారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు, 11 మంది ఉపాధ్యాయ బృం దం కనిపించడం గమనార్వం.






