04-09-2025 09:45:23 PM
అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు లారీలు సీజ్... పోలీస్ స్టేషన్ కు తరలింపు
జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాస్
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలో గుట్టలు మయమవుతున్నాయి. మొన్న ఇసుక లారీల పేరుతో గుట్టలు మాయం, నేడు జాతీయ రహదారి పేరిట పర్మిషన్ లేకుండానే గత కొన్ని రోజులుగా రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు పారుపల్లిలో గుట్ట మట్టిని లారీలతో తరలిస్తున్నారు. పారుపల్లి గుట్టల నుంచి నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి కోసం గత కొన్ని రోజులుగా పర్మిషన్ ఉందని, తెలుపుతూ రాత్రి పగలు మట్టిని కాంట్రాక్టర్ తరలించారు. బుధవారం రాత్రి జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాస్(District Mining Officer Srinivas) పారుపల్లి నుంచి ముత్తారంకు తరలిస్తున్న మట్టికి ఎలాంటి పర్మిషన్ లేదని, మట్టి లోడుతో వెళుతున్న లారీలను పట్టుకొని ముత్తారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరి ఇన్ని రోజులు రెవెన్యూ, మైనింగ్ అధికారుల పర్మిషన్ లేకుండానే మహారాష్ట్ర లోని చంద్రపూర్ నుంచి విజయవాడ వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి కోసం మెగా కంపెనీ కాంట్రాక్టర్ తీసుకొని ముత్తారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న రోడ్డుకు ఇన్ని రోజులు మట్టి ని ఎలా తరలించారు. అనేది ప్రశ్నగా మారింది. ఈ విషయంపై జిల్లా మైనింగ్ ఏడి శ్రీనివాస్ ను వివరణ కోరగా ముత్తారంలో మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. లారీల్లో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని తమకు సమాచారం అందగా రాత్రి మూడు లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించమన్నారు. పట్టుకున్న లారీలకు జరిమానా విధిస్తామన్నారు.