17-11-2025 04:53:57 PM
నిర్మల్ (విజయక్రాంతి): విజ్ఞానంతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అటువంటి విజ్ఞానాన్ని అందించడంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో కీలకమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జున్ మంద్ అలీ అన్నారు. సోమవారం 58వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని గ్రంథాలయంలో విద్యార్థులకు పాఠకులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాందేడపు చిన్ను కాంగ్రెస్ పట్టణం అధ్యక్షులు, జునేత్ డిస్ట్రిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్, కిజర, సందీప్, గ్రంథాలయ అధికారులు పి విజయ ,శ్రీ రాథోడ్ మోహన్ సింగ్, కట్కం సంజీవరెడ్డి, గుండాల పృథ్వి రాజ్ ,భోజనం లెనిన్, గ్రంథాలయ పాటకులు పాల్గొన్నారు