17-11-2025 04:56:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, మామడ, దిలావర్ పూర్, నర్సాపూర్, సొన్, లక్ష్మణచందా మండలాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందిన వారు CMRF కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.