17-11-2025 04:43:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వివరించవద్దని జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై అడిషనల్ కలెక్టర్కు జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు చెప్పిన సమస్యలను ఓపికగా విన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రత్న కళ్యాణి జెడ్పి సీఈవో గోవిందు అధికారులు పాల్గొన్నారు.