17-11-2025 05:35:15 PM
సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం...
నకిరేకల్ (విజయక్రాంతి): రామన్నపేట మండలంలోని మునిపంపుల, పల్లివాడ గ్రామాలకు గ్రామ పాలనాధికారి(జిపిఓ)ను కేటాయించి ప్రజల సమస్యను పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, ప్రభుత్వ యంత్రాంగన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ లాల్ బహదూర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు నెలకొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పరిపాలన అందించేందుకు ఇటీవల ప్రభుత్వం నియమించిన గ్రామ పాలనాధికారులు(జిపివో) ను మండలంలో అన్ని గ్రామాలకు కేటాయించి ఈ రెండు గ్రామాలకు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
వివిధ ధ్రువీకరణ పత్రాలు, రెవిన్యూ సమస్యలు పరిశీలన చేసేవారు లేక ప్రజల స్థానిక తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మండలంలో అన్ని గ్రామాలకు జిపిఓలను కేటాయించి ఈ గ్రామాలకు కేటాయించకపోవడం సరికాదని వెంటనే ప్రభుత్వం స్పందించి మునిపంపుల-పల్లివాడ గ్రామాలకు గ్రామ పరిపాలన అధికారులను కేటాయించి ప్రజల సమస్యను పరిష్కారం చేయాలని అన్నారు. లేనిపక్షంలో గ్రామాల ప్రజలతోటి పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి నగేష్, మండల కమిటీ సభ్యుడు తొలుపునూరి శ్రీనివాస్, గ్రామ శాఖ నాయకులు మేడి ముకుంద, బూడిద మధు, తుర్కపల్లి నరేష్, బూడిద గణేష్ తదితరులు పాల్గొన్నారు.