calender_icon.png 17 November, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయో వృద్ధులను గౌరవిద్దాం

17-11-2025 04:50:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): వయో వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించేలా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. వయోవృద్ధులను ప్రతి ఒక్కరు గౌరవించి వారి హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఉద్యోగి పాటుపడాలని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవిందు డిఆర్ఓ రత్న కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.