17-12-2025 01:42:12 AM
ఇన్నోవేషన్, సంస్కృతి సంగమంగా నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాం తి): లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ (ఎల్‌టీసీ) తన తొలి కంపెనీ డేను హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్స్‌లో విజయవంతంగా నిర్వహించింది. సంస్థ ప్రయాణం, ఉద్యోగులు, అలాగే ఇన్నోవేషన్, ఐక్యత, లక్ష్యసాధనపై ఆధారపడిన బలమైన సంస్కృతిని ఘనంగా జరుపుకునేందుకు ఈ అంతర్గత కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. టెక్నాలజీ ప్రదర్శనలు, నాయకత్వ ప్రసంగాలు, ఉద్యోగుల ప్రతిభకు గుర్తింపు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిసిన ఒక సంపూర్ణ అనుభవంగా ఈ కార్యక్రమం నిలిచింది.
ఈ రోజంతా జరిగిన కార్యక్ర మాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప్రాజెక్ట్ షోకేస్. ఎల్ టి సిలో జరుగుతున్న అత్యాధునిక సాంకేతిక అభివృద్ధి, ఇన్నోవేటివ్ సొల్యూ షన్స్ను ఇది స్పష్టంగా చూపించింది. ఉద్యోగులు ప్రదర్శించిన ఉత్సాహభరిత సాం స్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ వేడు కలో ఏడాది పొడవునా అసాధారణ అంకితభావం, ఇన్నోవేషన్, సహకారాన్ని ప్రదర్శించిన వ్యక్తులు, బృందాలకు పురస్కారాలు అందజేశారు.
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శీరిషా వోరుగంటి మాట్లాడుతూ.. ‘మా తొలి కంపెనీ డే లాయి డ్స్ టెక్నాలజీ సెంటర్ను నిర్వచించే ప్రతిభ, ఆత్మస్థైర్యానికి అద్దం పడుతుంది. ఇది మన సమిష్టి విజయాలను జరుపుకునే రోజు, అలా గే మా ఇన్నోవేషన్ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్న అసాధారణ వ్యక్తులు, బృందాలను గుర్తించే రోజు’ అన్నారు. ఎల్‌టిసి యొక్క సీఎస్‌ఆర్ భాగస్వామ్య ఎన్జీఓల ద్వారా వచ్చిన చిన్నారులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు.