calender_icon.png 17 December, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూలో అవినీతి అధికారి

17-12-2025 01:40:34 AM

  1. లంచం తీసుకుంటూ దొరికిన డీఈఈ శ్రీనివాస్

పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్‌కు వేధింపులు

రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. పెండింగ్ బిల్లులు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన బిల్డింగ్ డివిజన్ డీఈఈ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. మంగళవారం వర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.

యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ భవన మరమ్మతు పనులను ఓ కాం ట్రాక్టర్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ నుంచి సదరు కాంట్రాక్టర్‌కు రూ.14 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. పెండిం గ్ బిల్లులను మంజూరు చేయాలంటే తనకు రూ.11 వేలు లంచం ఇవ్వాలని బిల్డింగ్ డివిజన్ డీఈఈ రాకొండ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. అధికారి వేధింపులతో విసిగిపోయిన కాంట్రాక్టర్..

మొద ట విడతగా రూ.5 వేలు ఆన్లున్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేర కు మిగిలిన రూ.6 వేలు లంచం మంగళవారం ఆఫీసులో శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.