calender_icon.png 28 October, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2న నింగిలోకి ఎల్వీఎం3ఎం5

28-10-2025 01:02:41 AM

-రాకెట్ ప్రయోగానికి  శ్రీహరికోటలో ఇస్రో ఏర్పాట్లు

-భూబదిలీ కక్షలోకి..‘జిసాట్ సెవెన్‌ఆర్’ను ప్రవేశపెట్టనున్న శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: అతిభారీ రాకెట్ ఎల్వీం3ఎం5 ను నవంబర్ 2వ తేదీన అంతరిక్ష్యంలోకి ప్రయోగించేందుకు భారత అంత రిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతుంది. ఈ ప్రయోగాన్ని తిరుపతి జిల్లా సతీష్ ధావ న్ స్పేస్ సెంట్ శ్రీహరికోటలోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఇస్రోశాస్త్రవేత్తలు నిర్వంచనున్నారు. 4,400 కేజీల(4.4టన్నులు) బరువు కలిగిన ‘జీసాట్ సెవెన్ ఆర్’ అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న ‘జీటీఓ ఆర్బిట్’(జియో సింక్రోనస్ ట్రాన్సఫర్ ఆర్బిట్) భూబదిలీ కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఎల్‌వీఎం3ఎం5 రాకెట్‌ను సతీష్‌ధావన్ స్పేస్ సెంట్ షార్ నుంచి ప్రయోగించేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేశారు. దీనిలో భాగంగా వాహక నౌకను శ్రీహరికోటలోని రెండో లాంచ్‌ప్యాడ్‌కు రెండు రోజుల క్రతమే (అక్టోబర్26న) సురక్షితంగా తరలించారు. 2025 నవంబర్2న సాయంత్రం ఎల్వీఎం3ఎం5 రాకెట్ ద్వారా ‘జిసాట్ సెవెన్‌ఆర్’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ఆర్బిట్‌లోకి పంపేందుకు ఇస్రో శాస్త్ర వేత్తలు శ్రీహరికోటలోని రెండో లాంచ్‌ప్యాడ్ వద్ద రాకెట్ అనుసంధాన పక్రియను వేగం గా పూర్తి చేసి, రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.

వాతావరణం అనుకూలిస్తే శాస్త్రవేత్తలు అనుకున్న ప్రకారం భారీ బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని నవంబర్2న పూర్తి చేయనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు షార్ నుంచి ఇప్పటి వరకు ఇంత బరువు గల భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఈ ప్రయో గం సక్సస్ అయితే ఇస్రో మరో మైలురాయి అధిగమించనుంది.  

మెరుగైన ఇంటర్నెట్ సేవలే లక్ష్యంగా

ఈ జీసాట్ సెవెన్ ఉపగ్రహాన్ని ఇస్రోశాస్త్రవేత్తలు 2013 సంవత్సరంలో ఫ్రెంచ్ గయానా నుంచి కమర్షియల్ రాకెట్ ను ప్రయోగించారు. ఆ రోజు నుంచి భారత దేశానికి జీసాట్7 శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తూ ఉన్న ఈ ఉపగ్రహం కాలపరిమితి ముగిసింది. దీంతో ఇస్రోశాస్త్రవే త్తలు సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘జీసాట్ సెవెన్‌ఆర్’ అనే ఉపగ్ర హాన్ని తయారు చేశారు. ఈ ఉపగ్రహాన్ని నవంబర్2న నింగిలోకి పంపేందుకు సిద్ధమయ్యారు. “జీసాట్ 7ఆర్’.. ప్రయోగించిన రోజు నుంచి మరో 10 ఏళ్ల పాటు భారతదేశానికి మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందిం చ నుంది. అయితే భారత దేశంలోని పలు మారుమూలప్రాంతాల్లోని ప్రజలు పూర్తిగా సరిపడనంత ఇంటర్నెట్ సేవలు లేక నానా రకాలుగా పడుతున్న ఇబ్బందులకు ‘జీసాట్7ఆర్’ చెక్‌పెడుతుందని ఇస్రో శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు.