28-10-2025 01:00:35 AM
-కుక్కల బెడద నివారణ చర్యలపై అఫిడవిట్లేవి?
-రాష్ట్రాలపై సుప్రీంకోర్టు మండిపాటు
-సీఎస్‌లు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: వీధి కుక్కల బెడదకు పరిష్కారం చూపే చర్యలను నివేదిం చడంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాలు విఫలమయ్యాయని భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిం ది. దేశంలో నిత్యం ఏదో ఒకచోట వీధి కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయని, తద్వారా దేశానికి చెడ్డపేరు వస్తోం దని అభిప్రాయపడింది. జంతు సంతతి నియంత్రణ (ఏసీబీ)లో రాష్ట్రాలు ఘోరం గా విఫలమయ్యాయని అక్షింతలు వేస్తూ ఢిల్లీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీలు) ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న వ్యక్తిగతం హాజరు కావాలని ఉత్త ర్వులు జారీ చేసింది.
వీధికుక్కల దాడులను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు, 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆగస్టు 11న ఆదేశించింది. ఈ కేసుపై సోమవారం సుప్రీంకోర్టు విచారణచేపట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రభుత్వాలు మినహా మిగిలిన రాష్ట్రాలు, యూటీలు దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.