calender_icon.png 22 December, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ నీళ్ల శాశ్వత ద్రోహి కేసీఆరే!

22-12-2025 02:52:25 AM

  1. కూతురు లేవనెత్తిన ఆరోపణలపై స్పందించలేదు
  2. బీఆర్‌ఎస్ హయాంలో చెరువుల కబ్జా.. హైడ్రాతో మళ్లీ ప్రాణం
  3. కాంగ్రెస్ రాష్ట్ర అధికారప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్

హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): ‘ఓడిన రెండు సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన కూతురు ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన అవినీతి అంశంపై స్పందిస్తారని ఆశించాం. బేసిన్లు లేవు భేషజాలు లేవన్న కేసీఆర్, తెలంగాణ నీటి వాటకు శాశ్వత ద్రోహం చేసిందీ ఆయననే’ అని కాంగ్రెస్ రాష్ట్ర అధికారప్రతినిధి డాక్ట ర్ కొనగాల మహేష్ తీవ్ర ఆరోపణలు చేశా రు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వయంగా కేసీఆర్ కూతురే తన తండ్రి కేసీఆర్ పదేండ్ల పరిపాలనలో కోట్ల రూపాయల అవినీతి జరిగిం దని, భూ కబ్జాలు జరిగాయని చెప్తుంటే, పార్టీ అధ్యక్షులుగా దానికి వివరణ అకౌంటబిలిటీ/బాధ్యత కేసీఆర్‌పై ఉన్నది.

కానీ, తనకు అబద్ధాలాడే అలవాటు పోలేదని మరోసారి రుజువు చేసుకున్నారని పే ర్కొన్నారు. మహారాష్ట్ర ఒప్పందంతో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని పేర్కొన్నారు. పోతిరెడ్డి పాడుకు పొక్క గొట్టి రోజుకి 8టీఎంసీల నీటిని ఆక్రమంగా ఆంధ్రా తరలిస్తుంటే కళ్లు మూసుకొని కూ ర్చున్నది కేసీఆర్ అని ఆరోపించారు.