calender_icon.png 8 October, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్కంఠకు తెరపడేనా?

08-10-2025 12:35:52 AM

  1. నేడు హైకోర్టు తీర్పు

అనుకూలంగా వస్తే ఉమ్మడి జిల్లాలో బీసీ లకు 27 జెడ్‌పీటీసీ, ఎంపీపీ 

కరీంనగర్, అక్టోబర్7(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూ ల్ విడుదలైంది.రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. హై కోర్ట్ లో ఈ నెల 8 (నేడు) తీర్పు వెలువడనున్న నేపథ్యం లో అన్ని పారీ లలో పోటీకి సిద్ధం అవుతున్న వారిలో ఉత్కంఠ నె లకొంది.షెడ్యూల్ విడుదల అయిన నాటి నుండే అన్ని పార్టీలు పోరుకు సిద్ధమయ్యా యి. మండల, గ్రామస్థాయి నాయకులతో ముఖ్య నేత లు అభ్యర్థుల వేటలో పడ్డారు..

నాలుగు జిల్లాలలో యంత్రాంగం కూడా ఎ న్నికల ఏర్పా ట్ల కు సిద్ధం అయ్యారు. అయితేబీసీ రిజర్వేషన్లపై 8వ తేదీన హై కోర్టు ఇవ్వబోయే తీర్పు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. తీర్పు ఎలా ఉండ బోతుందో అ న్న అంచనాలు ఎవరికి వారిగా వేసుకుంటున్నారు. రిజర్వేషన్ ల పై సుప్రీం ధర్మాసనం హై కోర్టు నిర్ణయానికి వదిలి వేయడంతో ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలు వెలువడుతుందా వెలువడ్డా కోర్టు మర్హదర్శకాల ప్రకారం మారుయిందా అన్నది నేడు తేలుతుంది.

స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడి న తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సిరిసిల్ల జిల్లాకు చెం దిన వంగ గోపాల్ రెడ్డి సుప్రీం కోర్టులో దాఖ లు చేసిన పిటిషన్ ను జస్టిస్ విక్రమ్నా థ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధ ర్మాసనం విచారణకు స్వీకరించేందు కు నిరాకరించింది. అయితే నేడు హై కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణులతో ఉంది.

స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా పావులు కదుపుతున్న రాజ కీయ పార్టీలు.. కార్యకర్తలు, నాయకులతో అంతర్గతంగా సమావేశమవుతున్నాయి. రిజర్వేషన్ల ప్రకారం ఆశావహుల జాబితాలు సిద్ధం చేయాలని అధికార కాంగ్రెస్‌తో పాటు బి ఆర్ ఎస్, బిజేపీ, వామపక్షి వార్ట్ ల అధినాయకత్వాలు ఇప్పటికే తమ జిల్లా స్థాయి నేతలకు సూచించాయి. దీంతో ఉ మ్మడి జిల్లాలోని అన్ని నియోజ కవర్గాల్లో నే తలు అంతర్గత సమావేశా లునిర్వహించారు.

ఈ క్రమంలో షెడ్యూ ల్ ప్రకారంగా ఎన్నికలు జరుగుతాయా, హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశాలపై కేటాయించిన రిసర్వేషన్ లు యధావిధిగా ఉంటాయా మారు తాయా అన్న అంశంపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. నాలుగు జిల్లాలలో 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం 60 జెడ్ పి టి సి, ఎం పి పి స్థానాలలో27 స్థానాలు బి సి రిజర్వు అయ్యాయి.

జిల్లల వారిగా చూస్తే కరీంనగర్ జిల్లాల లో మొత్తం 15 మండలాలు ఉండగా 6, జగిత్యాల జిల్లాలో 20 మండలాలు ఉండగా 9, పేద్దపల్లి జి ల్లాలో 13 మండలాలు ఉండగా 6, రాజన్న సీరిసిల్ల జిల్లాల్లో 12 మండలాలు ఉండగా 5 జెడ్ పి టి సి, ఎం పి పి స్థానాలు బి సి లకు రిజ ర్వు అయ్యాయి.

జెడ్ పి చైర్మన్ పదవుల విషయానికి వస్తే కరీంనగర్ బి సి జనరల్ కు రిజర్వు కాగా జగిత్యాల, పెద్దపల్లి జనరల్ మహిళకు కేటాయించారు. హై కోర్టు తీర్పు ప్రభుత్వ జీ ఓ కు అనుకులంగా ఉంటే కేటాయించిన రిజర్వేషన్ స్థానాలలో మార్పు ఉండదు, తీర్పు అనుకూలంగా లేకుంటే ఏవిధమైన మార్పులుఉంటాయోచూడాలి.