13-12-2025 01:45:32 AM
కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి
చేగుంట, డిసెంబర్ 12 :చేగుంట మండలంలోని బోనాల కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తోట రమేష్ కి మద్దతుగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోట రమేష్ ప్రజల కోసం ఎల్లప్పుడూ పనిచేసే నిజమైన నాయకుడని అన్నారు.
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కష్టపడే నాయకుడిని గెలిపిస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెపు వెంగళరావు, మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రెటరీ ముజామిల్, గ్రామ అధ్యక్షులు రమేష్, పర్శరాం,పరమేష్, మహిపాల్, శ్రీకాంత్ రెడ్డి, బూరుగు శ్రీను, నర్సింలు, ప్రభాకర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.