calender_icon.png 30 July, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలయ పక్ష ప్రత్యేక సప్త మోక్ష క్షేత్ర యాత్ర

30-07-2025 01:40:05 AM

- సెప్టెంబర్ 9న ప్రత్యేక రైల్ ప్రారంభం

- ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్, టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ

ముషీరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టినట్లు ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్, టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. ఈ మేరకు  మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్, మేనేజర్ యాకేశ్ లతో కలసి యాత్రకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించి మాట్లాడారు.

15 రోజుల పాటు జరిగే మహాలయ పక్ష ప్రత్యేక సప్త మోక్ష క్షేత్ర యాత్ర రైల్ సెప్టెంబర్ 9 న ప్రారంభం అవుతుందన్నారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొం డ, హైదరాబాద్, కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు. గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజీకి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఈ యాత్రకు నడుం బిగించిందన్నారు. ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ద పూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్ రాజ్, వారణాసి, గయ వంటి పవిత్ర పుణ్య క్షేత్రాలను కవర్ చేయనున్నామని చెప్పారు.

గతంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది యాత్రికులతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి టూరిస్ట్ రైలు ఆపరేటర్ ’టూర్ టైమ్స్’ అన్నారు. ఈ యాత్ర ప్యాకేజీపై ఇండియన్ రైల్వే 33 శాతం సబ్సిడీ ఇస్తుందని, టికెట్లను ఫోన్ : 9355021516 లో బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఆన్లైన్ బుకింగ్ కోసం www.tourtimes.in సందర్శించ వచ్చన్నారు.