calender_icon.png 13 July, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పంటలను 50 వేల ఎకరాలకు సాగు పెంచాలి

12-07-2025 08:52:31 PM

ఉద్యాన శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి..

నల్గొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లాలో ఆయిల్ పామ్ పంటను యాభై వేల ఎకరాల వరకు సాగు పెంచాలని ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి పిన్నపురెడ్డి అనంత రెడ్డి, పతంజలి డీజీఎం యాదగిరి లకు రాష్ట్ర రోడ్లు భవనముల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాటి(District Collector Ila Tripathi)తో కలిసి ఉద్యాన శాఖపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. వరికి ప్రత్యాన్యాయముగా అధిక ఆదాయమునిచ్చే ఆయిల్ పామ్ ఇతర ఉద్యాన పంటలు సాగు చేసేలా ప్రోత్సాహించాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సత్వారమే యుద్ధ ప్రాతిపాధికాన 100 టిపిహెచ్ (గంటకు వంద టన్నులు) సామర్ధ్యము గల ఫ్యాక్టరీ ఏర్పాటు ఆగస్టు మాసములో ప్రారంభించాలని పతంజలి కంపెనీకి ఆదేశించారు.

ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు మిగతా సాంప్రదాయ పంటల కంటే అధికంగా ఎన్నో రేట్లు ఆధాయాన్ని అందిస్తుందని ఒకసారి నాటితే 30 సంవత్సరముల వరకు పంట దిగుబడి ఇస్తుందని, నెలనెల ఆదాయాన్ని కలిస్తుందని, నీటి వసతి కలిగిన రైతులందరు ఆయిల్ పామ్ ఉద్యాన పంటల వైపు రావాలని సూచించారు. ప్రభుత్వం ఈ పంటలకు భారీ రాయితీలు మార్కెటింగ్ వసతి కల్పిస్తునందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని, నేల సారాన్ని కాపాడుకోవాలని, వరి వంటి అధిక నీటి వినియోగపు పంటలన విస్తీర్ణం కోంతమేరా తగ్గించాలని సూచించారు.