calender_icon.png 13 July, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలకు పీఎన్బీ తోడ్పాటు

12-07-2025 08:56:34 PM

హాలియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభించిన ఈడి పరమశివం..

హాలియా (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత వ్యవసాయ రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank) ఎప్పుడు అండగా ఉంటుందని వ్యవసాయ అభివృద్ధి కోసం తమ బ్యాంకు సేవలు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం పరమశివం(Executive Director M Paramasivam) అన్నారు. హాలియాలో నూతనంగా ఏర్పాటు చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ హాలియా శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ దేశవ్యాప్తంగా తమ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్త మెగా అగ్రి అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 200 బ్రాంచ్ ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అవుట్ రీచ్ విధానంలో భాగంగా స్వయం సహాయక బృందాలు రైస్ మిల్ ఫైనాన్సింగ్ కిసాన్ క్రెడిట్ కార్డులు అగ్రి గోల్డ్ లోన్లు చిరు వ్యాపారులకు రుణ సదుపాయం తదితర కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 25 చెక్కులను సుమారు రూ.50 కోట్లకు పైగా విలువక చేసిన 25 చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జోనల్ ప్రధాన అధికారులు  సునీల్ కుమార్, చుగ్, జోనల్ హెడ్ లాలా లజపతిరాయ్ సర్కిల్ హెడ్ అరవింద్ కల్రా, ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. వెంకన్న వైస్ ప్రెసిడెంట్ నాని కిషోర్ జిల్లా రైస్ మిల్లర్స్ గౌరవాధ్యక్షుడు చిట్టి పూలు యాదగిరి వీరమల్ల శ్రీనివాస్, తీగల తిలక్ పలువురు జోనల్ అధికారులు, ఖాతాదారులు పాల్గొన్నారు.