12-07-2025 08:57:26 PM
మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్
మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు. శనివారం రామగిరి మండలంలోని శ్రీపాద ఐఎన్టీయూసి భవన్‌లో తొట్ల తిరుపతి యాదవ్ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రొడ్డ బాపన్న ఆధ్వర్యంలో నిర్వహించిగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ... పుట్ట మధు ప్రజల కోసం కాదని, తన రాజకీయ ఉనికికోసమే వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
మంత్రి చేసిన అభివృద్ధిని ప్రశంసించడమే కాకుండా, ప్రజలకు ఉపయోగపడే మార్గంలో వ్యవహరించాల్సిన బాధ్యత అతనిపై ఉందని, కానీ ఆయనకు అభివృద్ధిపై ఏమాత్రం ఆసక్తి లేదని మండిపడ్డారు. ఇటీవల రామగిరి మండలంలోని నాగపెల్లి గ్రామంలో చోటు చేసుకున్న ప్రేమవివాహ జంట ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని రాజకీయంగా వాడుకుంటూ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబులపై నిందలు వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నీవు ఒకప్పుడు ఎమ్మెల్యే గా, జడ్పీ చైర్మన్‌గా ఉన్నావని, రాజ్యాంగ విలువల పట్ల నీకు బాధ్యత ఉండాలని, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం ఏ విధంగానూ సమర్థించదగినద్దన్నారు.
ప్రజల శాంతిని భద్రపరచాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, గత పాలనలో బీఆర్ఎస్ నాయకుల తీరుతో గ్రామాల్లో అలజడి వాతావరణం నెలకొన్నదని, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు. శ్రీధర్ బాబు నాయకత్వం లేకుండా మీ రాజకీయ జీవితం నిలదొక్కుకోలేకపోతుందని. ఆయన పేరును జపించకపోతే మీ పబ్బం గడవదన్న విషయం మీకే తెలుసంటూ తిరుపతి యాదవ్ ఎద్దేవా చేశారు. మరోసారి మంత్రి శ్రీధర్ బాబు పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు లపై అసత్యపు ఆరోపణలు చేస్తే దానికి సమాధానం రెట్టింపులో ఉంటుందని హెచ్చరించారు.