calender_icon.png 13 July, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

12-07-2025 09:00:18 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి(Constituency In-charge Cheruku Srinivas Reddy) అన్నారు. శనివారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారస్పూర్ రైతు వేదికలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల 18 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని  ప్రభుత్వం నిరుపేదలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. నిరుపేదల వైద్య సహాయానికి సహాయ సహకారాలు అందిస్తుందని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు పడాల రాములు, సుధాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు, నాయకులు, కర్నాల శ్రీనివాస్ రావు, మద్దెల స్వామి, ఆది వేణుగోపాల్, మల్లారెడ్డి, పడాల మల్లేశం, ఆంజనేయులు గౌడ్, ఏసు, నరసింహారెడ్డి, ప్రవీణ్, సంపత్ రెడ్డి, నరసింహులు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.