calender_icon.png 7 October, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించాలి

07-10-2025 06:56:02 PM

టిఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనతడుపుల అంజయ్య..

కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): మాదిగ కులస్తుడు అనే నెపంతో పథకం ప్రకారమే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై ఇద్దరు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనతడుపుల అంజయ్య అన్నారు. మంగళవారం కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో పలువురు మాదిగ నాయకులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ మృదుస్వభావి, క్రింది స్థాయి నుండి అంచలంచలుగా ఎదిగి మంత్రివర్గంలో చోటు  దక్కించుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కావాలనే కొందరు మాదిగ కులస్తుడు అనే ఒక పథకం ప్రకారం అనేక రకాలుగా వేధిస్తున్నారని అన్నారు. కనీసం ప్రక్కన కూర్చునే హక్కు కూడా లేదు అనే చందంగా మాట్లాడడం విడ్డూరమని వ్యాఖ్యానించడం చాలా బాధాకరమని అన్నారు.

మంత్రివర్యులు కూడా అట్టడుగు వర్గాల నుండి వచ్చిన వారు కావడం మరి ఆశ్చర్యకరంగా ఉంది అని అన్నారు. రాజ్యాంగంలో ఇక్కడ మాదిగల్ని సహచరులుగా, సహచర ప్రజాప్రతి నిధిగా చూడకూడదని రాసి ఉందో చెప్పాలని వారి డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజాప్రతి నిధులే పాటించకుంటే చదువురాని వారు చాలామంది ఈ దేశంలో ఉన్నారని వారు ఎలా అర్థం చేసుకుంటారో తెలియ చెప్పవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి వెనుకాడ బోమని వారూ హెచ్చరించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి. కల్పించుకొని మళ్లీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శంకర్ మాదిగ సంఘం మండల అధ్యక్షులు, బడుగు భూమేష్, మారంపల్లి శ్రీధర్, బాబురావు, లంక తుకారాం, శనిగరపు రాజయ్య, సిహెచ్ నరసయ్య,  తదితరులు పాల్గొన్నారు.