భక్తిశ్రద్ధలతో మహాశక్తి ఆలయ వార్షికోత్సవం
12-06-2024 01:35 AM
కరీంనగర్, జూన్ 11 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని చైతన్యపురి మహాలక్ష్మి ఆల య సన్నిధిలో మంగళవారం భక్తిశ్రద్ధలతో చతుర్దశ వార్షికోత్సవం జరిగింది. వేడుకలకు జగద్గురు శంకరాచార్య హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీస్వామి విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.






