టెకీ ఆత్మహత్య
12-06-2024 01:34 AM
కామారెడ్డి, జూన్ 11 (విజయక్రాంతి: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి ప్రవీణ్(30) ఆత్మహత్య చేసుకున్నాడు. పిట్లం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ కొన్ని నెలలుగా ఇంటి వద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోం కింద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవా రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని, వేలాడుతుం డగా స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






