calender_icon.png 4 May, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం తడవకుండా తాగిన ఏర్పాట్లు చేయండి

03-05-2025 12:02:16 AM

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ మే 2 (విజయక్రాంతి)రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షానికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ఎ మ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పెద్ద ముద్దునూరు, చందుపట్ల, గన్యా కుల గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

అంతకుముందు జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన వారి ధాన్యాన్ని తడవకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.